Teacher Assaults 30 Students | వంగిన బైక్ నంబర్ ప్లేట్.. 30 మంది విద్యార్థులను చితకబాదిన టీచర్
Teacher Assaults 30 Students | స్కూల్లో పార్క్ చేసిన బైక్ నంబర్ ప్లేట్ వంగి ఉండటాన్ని టీచర్ గమనించాడు. దీనిపై ఆగ్రహం చెందాడు. సుమారు 30 మంది విద్యార్థులను కర్రతో చితకబాదాడు. దీంతో విద్యార్థుల శరీరంపై వాతలు తేలాయి.
ముంబై: స్కూల్లో పార్క్ చేసిన బైక్ నంబర్ ప్లేట్ వంగి ఉండటాన్ని టీచర్ గమనించాడు. దీనిపై ఆగ్రహం చెందాడు. సుమారు 30 మంది విద్యార్థులను కర్రతో చితకబాదాడు. దీంతో విద్యార్థుల శరీరంపై వాతలు తేలాయి. ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. పోలీసులకు అతడ్ని అప్పగించారు. (Teacher Assaults 30 Students) మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అహ్మద్‌పూర్ సమీపంలోని క్రైస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన హాస్టల్ విద్యార్థులకు శనివారం రాత్రి నైట్ స్టడీ జరిగింది.
కాగా, నైట్ స్టడీ తర్వాత విద్యార్థులు తమ హాస్టల్‌కు వెళ్తున్నారు. అయితే పార్క్ చేసిన బైక్ నంబర్ ప్లేట్ వంగిపోయి ఉండటాన్ని టీచర్ ఉజ్వల్ సోని గమనించాడు. ఆ బైక్ స్టార్ట్ కాకపోవడంతో ఆయన ఆగ్రహించాడు. విద్యార్థులను పిలిచి తన బైక్ పాడు చేసింది ఎవరని ప్రశ్నించాడు. సమాధానం చెప్పకపోవడతో కర్రతో వారిని చితక బాదాడు. సుమారు 30 మంది విద్యార్థుల శరీరంపై వాతలు తేలాయి.
మరోవైపు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ జెబా నాదర్ దృష్టికి ఇది వెళ్లింది. దీంతో ఆయన చర్యలు చేపట్టారు. విద్యార్థులను దారుణంగా కొట్టిన టీచర్ ఉజ్వల్‌ను సస్పెండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఆ టీచర్‌ను అప్పగించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Mamata Banerjee | బీజేపీ ఎంపీకి బెంగాల్ అత్యున్నత పురస్కారం.. ప్రదానం చేసిన మమతా బెనర్జీ, ఎందుకంటే?
Student gang raped at party | యువతి అత్యాచారం ఆరోపణ.. బ్లాక్మెయిల్ చేస్తున్నదని నిందితుడి ఫిర్యాదు
Punjab Man Shoots Woman | పెళ్లిని తట్టుకోలేక.. మహిళపై కాల్పులు జరిపిన పొరుగు వ్యక్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

