Meghalaya tops HIV Cases | హెచ్ఐవీ కేసుల్లో టాప్‌లో మేఘాలయ.. 10,000 మందికిపైగా రోగులు
Meghalaya tops HIV Cases | హెచ్ఐవీ కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో మేఘాలయ నిలిచింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం పది వేల మందికిపైగా ఎయిడ్స్ రోగులు చికిత్స పొందుతున్నారు. మేఘాలయ ఆరోగ్య మంత్రి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీకి వెల్లడించారు.
షిల్లాంగ్: హెచ్ఐవీ కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో మేఘాలయ నిలిచింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం పది వేల మందికిపైగా ఎయిడ్స్ రోగులు చికిత్స పొందుతున్నారు. మేఘాలయ ఆరోగ్య మంత్రి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీకి వెల్లడించారు. (Meghalaya tops HIV Cases) ఎన్సీపీ ఎమ్మెల్యే మెహతాబ్ చండీ ఏ సంగ్మా అడిగిన ప్రశ్నకు మేఘాలయ ఆరోగ్య మంత్రి డబ్ల్యూ షిల్లా బుధవారం అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. దేశంలో అత్యధికంగా హెచ్ఐవీ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మేఘాలయ ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,293 మంది ఎయిడ్స్‌తో బాధపడుతున్నారని, యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఎఆర్టీ) పొందుతున్నారని మంత్రి అన్నారు.
కాగా, గత పదేళ్లలో మేఘాలయలో హెచ్ఐవీ కారణంగా 749 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రి షిల్లా తెలిపారు. తూర్పు ఖాసీ హిల్స్‌లో 435, పశ్చిమ జైంటియా హిల్స్‌లో 123, తూర్పు జైంటియా హిల్స్‌లో 90, రి భోయ్లో 51ఎయిడ్స్ మరణాలు నమోదైనట్లు చెప్పారు.
మరోవైపు హెచ్ఐవీ, ఎయిడ్స్ కేసుల నియంత్రణ కోసం రాబోయే ఐదేళ్లలో మిషన్-మోడ్ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందని మేఘాలయ ఆరోగ్య మంత్రి డబ్ల్యూ షిల్లా అసెంబ్లీకి తెలిపారు. అలాగే అవగాహన కార్యక్రమాలు, చికిత్స కేంద్రాలు, పరీక్షలు, సంరక్షణ చర్యల బలోపేతానికి జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 2025-26 సంవత్సరానికి మేఘాలయ ఎయిడ్స్ నియంత్రణ సంఘానికి రూ.17.8 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు.
Also Read:
Dog Carries Human Leg | ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. తెగిన కాలును నోట కరుచుకుని తిరిగిన కుక్క
Baby Loses Finger | ఐవీ డ్రిప్ తొలగిస్తుండగా నర్సు నిర్లక్ష్యం.. చిన్నారి వేలు కట్
BSNL officer Tour | లగ్జరీ టూర్‌కు బీఎస్ఎస్ఎల్ అధికారి ప్లాన్.. షో కాజ్ నోటీస్ జారీ
రైల్వేస్టేషన్‌లోని బెంచ్‌పై తల్లి మృతదేహం.. పక్కన ఏడుస్తూ పిల్లలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

