Veena George injured | కాంగ్రెస్ విద్యార్థి విభాగం నిరసన, దాడి.. కేరళ మంత్రికి గాయాలు
Veena George injured | కాంగ్రెస్ విద్యార్థి విభాగం నిరసన సందర్భంగా కేరళ మంత్రిపై దాడి జరిగింది. ఈ సంఘటనలో ఆమె గాయపడ్డారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ దాడిని ఖండించారు. దుర్మార్గపు రాజకీయాలకు ఉదాహరణ అని అభివర్ణించారు.
తిరువనంతపురం: కాంగ్రెస్ విద్యార్థి విభాగం నిరసన సందర్భంగా కేరళ మంత్రిపై దాడి జరిగింది. ఈ సంఘటనలో ఆమె గాయపడ్డారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ దాడిని ఖండించారు. దుర్మార్గపు రాజకీయాలకు ఉదాహరణ అని అభివర్ణించారు. (Veena George injured) బుధవారం కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రైలులో ప్రయాణించేందుకు కన్నూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అలప్పుజలో వైద్య నిర్లక్ష్యం వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేతృత్వంలో ఆ రైల్వే స్టేషన్ వద్ద నిరసన జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి వీణా జార్జ్‌ను నిరసకారులు చుట్టుముట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
కాగా, ఈ సందర్భంగా జరిగిన తోపులాట, దాడిలో మంత్రి వీణా జార్జ్ చేతికి, మెడకు గాయాలయ్యాయని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎఎన్ షంసీర్ తెలిపారు. కన్నూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
మరోవైపు సీఎం పినరయి విజయన్ ఆసుపత్రికి చేరుకుని మంత్రి వీణా జార్జ్‌ను పరామర్శించారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం దాడి ‘దుర్మార్గపు రాజకీయాలకు’ ఉదాహరణ అని అభివర్ణించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించి, రాష్ట్రంలో అశాంతిని సృష్టించే చర్యలని మండిపడ్డారు. వీటిని సహించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.
#WATCH | Kannur: Kerala Health Minister Veena George sustained injuries to her neck and hand during a KSU (Kerala Students’ Union) black flag protest at the Kannur Railway Station. The incident occurred near the ticket counter when the minister arrived to board the Vande Bharat… pic.twitter.com/0hvacLlmLt
— ANI (@ANI) February 25, 2026
#WATCH | Kannur: Kerala CM Pinarayi Vijayan visits Kannur Government Hospital to see State Health Minister Veena George.
Veena George sustained injuries to her neck and hand during a KSU (Kerala Students’ Union) black flag protest at the Kannur Railway Station.
(Video: Kerala… pic.twitter.com/bZNoGcSg1D
— ANI (@ANI) February 25, 2026
Also Read:
BSNL officer Tour | లగ్జరీ టూర్‌కు బీఎస్ఎస్ఎల్ అధికారి ప్లాన్.. షో కాజ్ నోటీస్ జారీ
Meghalaya tops HIV Cases | హెచ్ఐవీ కేసుల్లో టాప్‌లో మేఘాలయ.. 10,000 మందికిపైగా రోగులు
Man with axe in head | పెళ్లి వేడుకలో ఒక వ్యక్తిపై దాడి.. తలలో దిగిన గొడ్డలితో హాస్పిటల్‌కు
Dog Carries Human Leg | ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. తెగిన కాలును నోట కరుచుకుని తిరిగిన కుక్క
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

