Team India : శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత స్క్వాడ్‌లో మార్పులు చేశారు సెలెక్టర్లు. కుడి కాలి బొటన వేలి గాయం నుంచి కోలుకోని సాయి సుదర్శన్(Sai Sudarshan) స్థానంలో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)ను తీసుకున్నారు. రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు.. ఐపీఎల్ 19వ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన సర్ఫరాజ్‌కు అవకాశమిచ్చారు. ఆగస్టు 15న గాలేలో తొలి టెస్టుకు ముందే ఈ డాషింగ్ బ్యాటర్ స్క్వాడ్‌తో కలువనున్నాడు.
భారత టెస్టు స్క్వాడ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ వచ్చేశాడు. మూడో స్థానంలో ఆడే సాయి సుదర్శన్ సిరీస్ మొత్తానికి దూరమవ్వగా పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ప్రధానంగా రుతురాజ్ గైక్వాడ్, తెలుగబ్బాయి షేక్ రషీద్, సర్ఫరాజ్ఖాన్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చివరకు రంజీల అనుభవం, గతంలో ఇంగ్లండ్‌పై అర్ధ శతకాలతో ఆకట్టుకున్న సర్ఫరాజ్వైపై సెలెక్టర్లు మొగ్గు చూపారు. దులీప్ ట్రోఫీ (Duleep Trophy)లో వెస్ట్ జోన్ స్క్వాడ్‌లో ఉన్న అతడు త్వరలోనే భారత స్క్వాడ్‌లో చేరనున్నాడు. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15న గాలే మైదానంలో మొదటి టెస్టు జరుగనుంది. అనంతరం.. ఆగస్టు 23న రెండో టెస్టు ఉంటుంది.
🚨 NEWS 🚨
Sai Sudharsan ruled out of the #SLvIND Test series; Sarfaraz Khan named replacement.
Details 🔽 #TeamIndia https://t.co/lF6h8jabZd pic.twitter.com/Dk0C4HI37p
— BCCI (@BCCI) August 9, 2026
దేశవాళీలో సంచలన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ చివరగా టెస్టు మ్యాచ్ ఆడి రెండేళ్లు అవుతోంది. 2024లో న్యూజిలాండ్‌పై ఆడిన ఈ చిచ్చరపిడుగుకు సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో అవకాశం లభించింది. ఇప్పటివరకూ 11 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒక శతకం, మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు సర్ఫరాజ్.
భారత టెస్టు స్క్వాడ్(అప్డేటెడ్): శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, సరాన్ష్ జైన్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, అకీబ్ నబీ.