Woman Rape and Murder | ఒకే రోజు మహిళపై రెండుసార్లు అత్యాచారం.. బిల్డింగ్ పైనుంచి తోసి హత్య
Woman Rape and Murder | ఒక మహిళపై ఒకే రోజు రెండుసార్లు అత్యాచారాలు జరిగాయి. మొదట పెళ్లి పేరుతో రప్పించి ప్రియుడు రేప్ చేశాడు. బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న ఆమెను సహాయం పేరుతో మరో వ్యక్తి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ మహిళను బిల్డింగ్ పైనుంచి కిందకు తోసి హత్య చేశాడు.
భువనేశ్వర్: ఒక మహిళపై ఒకే రోజు రెండుసార్లు అత్యాచారాలు జరిగాయి. మొదట పెళ్లి పేరుతో రప్పించి ప్రియుడు రేప్ చేశాడు. బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న ఆమెను సహాయం పేరుతో మరో వ్యక్తి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ మహిళను బిల్డింగ్ పైనుంచి కిందకు తోసి హత్య చేశాడు. ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఫిబ్రవరి 22న తిర్టోల్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల మహిళ ప్రియుడితో కలిసి పారిపోయేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
కాగా, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ఆమెను ఒక గుడి వద్దకు రప్పించాడు. ఆ తర్వాత ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం రహమా బస్ స్టాండ్ వద్ద ఆ మహిళను వదిలేసి వెళ్లిపోయాడు.
అయితే బస్టాండ్ వద్ద ఒంటరిగా, నిరాశతో ఉన్న ఆ మహిళను బైక్‌పై వెళ్తున్న జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి చూశాడు. సహాయం చేస్తానని చెప్పి ఆమెను బైక్‌పై పారాదీప్ తీసుకెళ్లాడు. అద్దె ఇంటి బిల్డింగ్‌పైన ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి హత్య చేశాడు.
మరునాడు ఆ మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మహిళ మిస్సింగ్‌పై సోదరుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
మరోవైపు ఆ మహిళపై ఒకే రోజు ప్రియుడు, మరో వ్యక్తి అత్యాచారం చేయడంతో పాటు ఆమెను హత్య చేసినట్లు దర్యాప్తులో బయటపడటంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
కాగా, మాజీ సీఎం, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఈ సంఘటనను ఖండించారు. మహిళలపై నేరాలు పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాలి? అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read:
DMK Youth Member Arrested | చిన్నారిపై లైంగిక దాడి, హత్య.. డీఎంకే యువజన సభ్యుడు అరెస్ట్
IAS Officer Suspended | మంత్రి సమావేశాలకు గైర్హాజరు.. ఐఏఎస్ అధికారి సస్పెండ్
Couple’s Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే విడిపోయిన జంట.. ఎందుకంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

