Shoaib Malik: మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు షోయెబ్ మాలిక్‌పై ఊహాగానాలు.. క్లారిటీ ఇచ్చిన పాక్ క్రికెటర్
Shoaib Malik: మూడో పెళ్లి పుకార్లకు షోయెబ్ మాలిక్ చెక్ పెట్టాడు. తన పర్సనల్ విషయాల్లో జోలికొస్తే .. లీగల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నాడు. రెండో పెళ్లి చేసుకోవడానికి ముందే.. తన మొదటి పెళ్లికి ముగింపు పలికినట్లు గుర్తు చేశాడు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయెబ్ మాలిక్(Shoaib Malik) మూడోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మాజీ క్రికెటర్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. మూడో పెళ్లి గురించి వస్తున్న వార్తలు అవాస్తవం అని, తప్పుడు పద్ధతిలో తన గురించి ప్రచారం చేస్తున్నట్లు షోయెబ్ పేర్కొన్నాడు. దీనిపై ఆ క్రికెటర్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వ్యక్తిగత విషయాల పట్ల మౌనంగా ఉండడం వల్ల తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అదే నిజం అనుకుంటున్నారని, తన రెండో భార్య సనా జావెద్ పట్ల ఆన్లైన్లో జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని షోయెబ్ తన ప్రకటనలో కోరాడు.
భారత టెన్నిస్ స్టార్ , హైదరాబాదీ క్రికెటర్ సానియా మీర్జాను షోయెబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ 2023లో ఒప్పందం ప్రకారమే వేరుపడ్డారు. విడిపోయిన ఆ ఇద్దరూ.. తమ కుమారుడికి పేరెంట్స్‌గా ఉండేందుకు అంగీకరించారు. అయితే 2024 జనవరి 19వ తేదీన షోయెబ్ మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నాడు. కరాచీలో జరిగిన నిఖా సెర్మనీలో సనా జావెద్‌ను అతను పెళ్లాడాడు. షోయెబ్ తన స్టేట్మెంట్లో మొదటి పెళ్లి గురించి ప్రస్తావించాడు. మరోసారి పెళ్లి చేసుకోవడానికి ముందే తన తొలి మ్యారేజ్‌ను ముగించినట్లు చెప్పాడు. పబ్లిక్కు దూరంగా తన ప్రైవేటు జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు.
అయితే ఆన్లైన్లో ప్రచారం అవుతున్న కథనాలు చదివే స్థాయిలో తన కుమారుడు ఉన్నాడని, ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఊహాగానాలకు బదులు ఇవ్వాల్సి వస్తుందని షోయెబ్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. తనకు ఇష్టమైన వ్యక్తులపై అనుచిత కామెంట్లు చేయడం బాధాకరంగా, హానికరంగా ఉన్నట్లు చెప్పాడు. షోయెబ్ ఈసారి వార్నింగ్ కూడా ఇచ్చాడు. తనపై ఊహాజనిత వార్తలు ప్రచారం చేస్తే, దాన్ని పరువునష్టంగా భావించి, న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపాడు. ప్రైవసీ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సోషల్ మీడియా ప్రచారం ఊహాజనిత కథనాలతో వ్యక్తిగత జీవితాలను నాశనం చేయరాదు అని షోయెబ్ కోరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

