Peddi Sudarshan Reddy | నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట(Narsampet,) మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు( Officials removed statue) తొలగించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని మెడికల్ కాలేజీ ఎదరుగా ఉన్న విగ్రహాన్ని అర్దరాత్రి భారీ బందోబస్తు మధ్య పోలీసులు తొలగించారు.
పరిసర ప్రాంతాల్లోకి ఎవరని అనుమతించడం లేదు. చివరికి పోలీసులకు కూడా సెల్ఫోన్ అనుమతివ్వకుండా కట్టడి చేశారు. నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ కీలక నాయకులను అరెస్ట్ చేశారు. నర్సంపేటకు అదనపు బలగాలను తరలిస్తున్నారు.
కాగా, గతంలోనూ ప్రైవేట్ భూమిలో విగ్రహం ఏర్పాటు చేసినా కూడా అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోప్రైవేట్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మీకేంటని బీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. లీగల్గా వెళ్తామంటూ పోలీసులను హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.