చిక్కడపల్లి, ఫిబ్రవరి 27: ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని శుక్రవారం నిరుద్యోగులు చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదని వాపోయారు.