Ruhani Sharma | ‘ఆకాశంలో ఒక తార’లో రుహానీ శర్మ సొంత డైలాగ్స్ .. దర్శకుడు పవన్ సాదినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
Ruhani Sharma | దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సినిమాలో రుహానీ శర్మ ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథలో కీలక సమయంలో హీరోకి సహాయం చేసే నార్త్ ఇండియన్ యువతిగా ఆమె నటించింది. ముఖ్యంగా హీరోకి హిందీ అర్థం కాకపోవడం, వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు కామెడీని పండించడం ప్రేక్షకులను నవ్విస్తున్నాయి
Ruhani Sharma | దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సినిమాలో రుహానీ శర్మ ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథలో కీలక సమయంలో హీరోకి సహాయం చేసే నార్త్ ఇండియన్ యువతిగా ఆమె నటించింది. ముఖ్యంగా హీరోకి హిందీ అర్థం కాకపోవడం, వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు కామెడీని పండించడం ప్రేక్షకులను నవ్విస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో రుహానీ శర్మ పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను దర్శకుడు పవన్ సాదినేని వెల్లడించారు. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో రుహానీ శర్మ పాత్ర చిన్నదే అయినప్పటికీ, ఆమె కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. గుజరాత్ నేపథ్యంలో హీరోకి సహాయం చేసే ఉత్తర భారత యువతిగా ఆమె కనిపిస్తుంది.
హీరోకి హిందీ భాష అర్థం కాకపోవడం, ఆమె మాట్లాడే మాటలకు అతడు స్పందించే విధానం, ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాలో నవ్వులు పూయిస్తున్నాయి. అయితే ఈ సన్నివేశాల్లో రుహానీ శర్మ చెప్పిన డైలాగ్స్ వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉందని దర్శకుడు పవన్ సాదినేని వెల్లడించారు. ఆమె పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌లో దాదాపు 90 శాతం వరకు రుహానీ శర్మ స్వయంగా రాసుకుందని తెలిపారు. దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ.. తనకు హిందీ భాషపై అంతగా పట్టు లేదని తెలిపారు. రుహానీ శర్మకు సన్నివేశం నేపథ్యం, పాత్ర స్వభావం, ఆ సందర్భంలో మాట్లాడాల్సిన మాటల గురించి ఇంగ్లీష్‌లో వివరించేవాడినని చెప్పారు. ఆ వివరణ ఆధారంగా ఆమె తన పాత్రకు తగ్గట్టుగా హిందీ డైలాగ్స్‌ను స్వయంగా రూపొందించిందని వెల్లడించారు.
అంతేకాదు, సన్నివేశాలకు అవసరమైన సరైన హిందీ యాస, స్లాంగ్‌ను కూడా రుహానీ శర్మ అద్భుతంగా తీసుకొచ్చిందని దర్శకుడు ప్రశంసించారు. పాత్ర సహజంగా కనిపించడానికి ఆమె చేసిన ఈ ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు. రుహానీ శర్మతో చిత్రీకరించిన సన్నివేశాల్లో కొన్ని సినిమా నిడివి, కథనం వేగం దృష్ట్యా ఎడిటింగ్ సమయంలో తొలగించినట్లు పవన్ సాదినేని వెల్లడించారు. సినిమాలో ఉండాల్సిన సన్నివేశాలను మాత్రమే ఉంచుతూ, కథకు అవసరమైన విధంగా ఎడిటింగ్ చేశామని తెలిపారు. చిన్న పాత్రలో కనిపించినప్పటికీ తన నటనతో పాటు డైలాగ్స్ విషయంలోనూ రుహానీ శర్మ ప్రత్యేకంగా కృషి చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దర్శకుడి ప్రశంసలతో ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన విషయాలు ప్రేక్షకుల్లో మరింత చర్చనీయాంశమయ్యాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ruhani Sharma | ‘ఆకాశంలో ఒక తార’లో రుహానీ శర్మ సొంత డైలాగ్స్ .. దర్శకుడు పవన్ సాదినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
Dada | డిసెంబర్ 24న బాలయ్య ‘దాదా’ జాతర.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇస్తామంటూ మేకర్స్ హామీ!
Varanasi | యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన ‘వారణాసి’ భారీ కాశీ సెట్.. ఏరియల్ వ్యూ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
Bigg Boss 10 | నామినేషన్లతో హీటెక్కిన హౌస్.. వర్షిణి -సుధీర్ ఫైట్, అమన్‌పై దేబ్జానీ ఫైర్!
Revanth Reddy | పల్నాడుకు అనుమతులిచ్చింది బీఆర్ఎస్సే.. రేవంత్‌రెడ్డి తప్పడు ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

