Karthika Pournami | కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Karthika Pournami | కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి పరమశివుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
Karthika Pournami | కారేపల్లి, నవంబర్ 24: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి పరమశివుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి దీపారాధనలు చేశారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో సామూహిక దీపారాధనలు నిర్వహించారు. భక్తులు ఉపవాసాలు పాటిస్తూ దీపాలు వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. భక్తుల రాకతో పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

Karthika Pournami Karepall1
గ్రామగ్రామాన ప్రత్యేక పూజలు
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని లింగంబంజర, గేటు కారేపల్లి, కోటిలింగాల, ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ ఆలయం, కారేపల్లి, బిక్యా తండా తదితర గ్రామాల్లోని శివాలయాలు, ఇతర దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthika Pournami | కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Bala Krishna | బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్.. నూతన జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే కీలక సూచనలు!
Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
Ruhani Sharma | ‘ఆకాశంలో ఒక తార’లో రుహానీ శర్మ సొంత డైలాగ్స్ .. దర్శకుడు పవన్ సాదినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
Dada | డిసెంబర్ 24న బాలయ్య ‘దాదా’ జాతర.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇస్తామంటూ మేకర్స్ హామీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

