Bala Krishna | బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్.. నూతన జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే కీలక సూచనలు!
Bala Krishna | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిటాల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబానికి చెందిన పరిటాల శ్రీరామ్ తాజాగా జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులను, పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలుస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణను ఆయన ప్రత్యేకంగా కలిశారు.
Bala Krishna | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిటాల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబానికి చెందిన పరిటాల శ్రీరామ్ తాజాగా జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులను, పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలుస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణను ఆయన ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. హిందూపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పరిటాల శ్రీరామ్.. బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన బాలకృష్ణకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన పరిటాల శ్రీరామ్‌కు బాలకృష్ణ అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ పరిటాల శ్రీరామ్‌కు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధిగా తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జిల్లాలో తనదైన ముద్ర వేయాలని సూచించారు.
మరోవైపు బాలకృష్ణను కలిసిన అనంతరం పరిటాల శ్రీరామ్ తన ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనను జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా తనకు లభించిన బాధ్యతను కేవలం పదవిగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.ఇక పరిటాల శ్రీరామ్, నందమూరి బాలకృష్ణ మధ్య జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పరిటాల కుటుంబానికి, నందమూరి కుటుంబానికి ఉన్న రాజకీయ సంబంధాల నేపథ్యంలో ఈ సమావేశం చర్చనీయాంశమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krishna | బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్.. నూతన జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే కీలక సూచనలు!
Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
Ruhani Sharma | ‘ఆకాశంలో ఒక తార’లో రుహానీ శర్మ సొంత డైలాగ్స్ .. దర్శకుడు పవన్ సాదినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
Dada | డిసెంబర్ 24న బాలయ్య ‘దాదా’ జాతర.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇస్తామంటూ మేకర్స్ హామీ!
Varanasi | యాపిల్ మ్యాప్స్‌లో కనిపించిన ‘వారణాసి’ భారీ కాశీ సెట్.. ఏరియల్ వ్యూ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

