Madhusudana Chary | కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహాలు, మోసాలను కప్పి పుచ్చుకునేందుకే బడ్జెట్ సమావేశాలను వాడుకుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై గానీ, హామీలపై గానీ చర్చ చేయకుండా అసెంబ్లీ పవిత్రతను దిగజార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.
టీ బ్రేక్ పేరుతో గంటలపాటు సభను వాయిదా వేసి, విలువైన సమయాన్ని వృథా చేశారన్నారు. శాసన మండలిలో ఆరు రోజులపాటు జరగాల్సిన క్వశ్చన్ అవర్, రెండు రోజులు మాత్రమే జరిపారని.. అత్యంత కీలకమైన అంశాలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని మండిపడ్డారు. సభ ద్వారా చర్చించడం కోసం మేము ప్రజా ఉపయోగకరమైన వాయిదా తీర్మానాలను ప్రతిపాదించడం జరిగింది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్, మొక్కజోన్నొ పంట కొనుగోలు, ఫీజు రీయింబర్స్మెంట్, గ్యాస్ కొరత, రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలు పొంగులేటి అక్రమ మైనింగ్ అంశాలపై మేము చర్చించాలని డిమాండ్ చేస్తే చర్చకు రానివ్వలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహాలు, మోసాలను కప్పి పుచ్చుకునేందుకే బడ్జెట్ సమావేశాలను వాడుకుంది.
ప్రజల సమస్యల పైన గానీ, హామీల పైన గానీ చర్చ చేయకుండా అసెంబ్లీ పవిత్రతను దిగజార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది.
టీ బ్రేక్ పేరుతో గంటలు పాటు సభను వాయిదా వేసి, విలువైన సమయాన్ని… pic.twitter.com/GdnrjjRyxQ
— BRS Party (@BRSparty) April 2, 2026
Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత