Ganneruvaram | గన్నేరువరం, ఏప్రిల్ 2 : గన్నేరువరం మండలకేంద్రంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గ్రామ సభకు బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ కంకర తట్టను తీసుకెళ్లి నల్ల కండావా ధరించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణ గెలిచి రెండున్నర సంవత్సరాలుగా వస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కంకర రోడ్డే మండల ప్రజలకు దిక్కైందని వాపోయారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో గన్నేరువరం నుండి పొత్తురు వరకు తలపెట్టిన డబ్బులు రోడ్ నిర్మాణ పనుల గురించి కనీసం ప్రస్తావించలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా స్పందించి త్వరగా నిధులు విడుదల చేసి డబుల్ రోడ్డు నిర్మాణ పనులతో పాటు హై లెవెల్ బ్రిడ్జిలను నిర్మించాలని డిమాండ్ చేశారు.