Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల స్వర్ణాల వేట మొదలైంది. అందరికంటే ముందుగా ఫైనల్‌కు దూసుకెళ్లిన ప్రీతి పవార్ (Preeti Pawar) పసిడి పతకం కొల్లగొట్టింది. మహిళల 54 కిలోల విభాగంలో తిరుగులేని ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన ప్రీతి.. ఫైనల్లోనూ కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోపై పంచ్‌ల వర్షం కురిపించింది. కాసేపటికే జస్మినే లంబోరియా(Jasmine Lamboria) సైతం తగ్గేదేలే అంటూ ఉత్తర ఐర్లాండ్ బాక్సర్‌ను మట్టికరిపించి గోల్డ్ మెడల్ సాధించింది.
కామన్వెల్త్ క్రీడల పదోరోజు బాక్సర్ ప్రీతి పవార్ పసిడి పతకంతో మెరిసింది. మహిళల 48 కిలోల విభాగం సెమీఫైనల్లో అదిరే పంచ్‌లతో జాంబియాకు చెందిన జ్వాపే(Zwape)ను మట్టికరిపించిన ప్రీతి.. ఫైనల్లోనూ చెలరేగిపోయింది. రెండు రౌండ్లలో జోరు చూపించిన భారత బాక్సర్ ధాటికి కెనడా బాక్సర్ స్కార్లెట్ సవన్నా డెల్గాడో చేతులెత్తేసింది.
AND IT’S GOLD! 🥇🇮🇳
BOXING: PREETI PAWAR kicks off India’s campaign with a GOLD medal!
Defeats Scarlett Delgado of Canada 5:0 to clinch the Women’s 54kg Commonwealth Games title 👏 #Glasgow2026 #Glasgow2026withIAS pic.twitter.com/OOh99KBWCN
— India_AllSports (@India_AllSports) August 1, 2026
ఇక 57వ విభాగంలో రెచ్చిపోయిన జస్మినే సైతం స్వర్ణం పట్టేసింది. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మైఖేల్ వాల్ష్కు ఏమాత్రం అవకాశమివ్వని భారత బాక్సర్ 5-0తో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్ అయిన జాస్మినే కామన్వెల్త్లో పసిడి గెలిచి 57 కిలోల విభాగంలో తనకు తిరుగులేదని చాటింది. వీరిద్దరూ పోడియంపై నిల్చోవడంతో నేరుగా సెమీస్ చేరిన లొవ్లీనా బొర్గోహైన్ కూడా పసిడి సాధించాలని కోరుకుంటున్నారంతా.
BREAKING:
BOXING: JAISMINE LAMBORIA WINS GOLD MEDAL 🔥Beats Michaela Walsh 5:0 in Final (57kg) at Glasgow Commonwealth Games. #Glasgow2026 #Glasgow2026withIAS pic.twitter.com/ShqXvSWZvs
— India_AllSports (@India_AllSports) August 1, 2026