బూర్గంపహాడ్, ఏప్రిల్ 02 : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బూర్గంపహాడ్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బుడ్డగూడెం సమీపంలోని కిన్నెరసాని వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక లోడ్ చేసుకుని వస్తున్న రెండు ట్రాక్టర్లను మోరంపల్లిబంజర్ సమీపంలో పట్టుకున్నట్లు తెలిపారు. ట్రాక్టర్లను తాసీల్దార్కు అప్పగించినట్లు వెల్లడించారు.