న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో అక్రమ ఎల్పీజీ గ్యాస్ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒక వాహనంతో పాటు 45 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Illegal LPG Racket) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మార్చి 28న ఉదయం 7:00 గంటల సమయంలో హెడ్ కానిస్టేబుల్ రాజేష్ గస్తీ విధుల్లో ఉన్నారు. పాలంలోని ఒక నివాస ప్రాంతంలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వచేసినట్లు ఆయనకు సమాచారం అందింది.
కాగా, ఎస్ఐ ఆర్పీ మీనా నేతృత్వంలోని పోలీస్ బృందం వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి స్థలాన్ని తనిఖీ చేశారు. వాహనం లోపల, బయట భారత్ గ్యాస్‌కు చెందిన గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను పెద్ద సంఖ్యలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. అక్రమంగా రీఫిల్లింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని గ్రహించారు.
మరోవైపు ఆ వాహనంతో పాటు 45 గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సత్యవీర్, అసిస్టెంట్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న వికాస్ కుమార్, వాహనం డ్రైవర్ అనార్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Guests Assault Bride, Groom | మద్యం ఇవ్వలేదని.. వధూవరులపై పెళ్లి అతిథుల దాడి
Watch: ఒక ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. మహిళలు ఏం చేశారంటే?