Batwara 1947 | దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ ‘బట్వారా 1947’.. ట్రైలర్ రిలీజ్!
Batwara 1947 | బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ హిస్టారికల్ డ్రామా చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.
Batwara 1947 | బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ హిస్టారికల్ డ్రామా ‘బట్వారా 1947’ (Batwara 1947) నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. దేశ విభజన నాటి భయానక పరిస్థితులు, ద్వేషం మధ్య ఒక వ్యక్తి చూపించిన అసాధారణ ధైర్యం నేపథ్యంలో సాగే భావోద్వేగభరిత చిత్రంగా ఈ చిత్రం రాబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా 2026, ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
గతంలో ‘ఘాయల్’, ‘దామిని’, ‘ఘాతక్’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన స్టార్ డైరెక్టర్ రాజ్కుమార్ సంతోషి, సన్నీ డియోల్ కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’ బ్యానర్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో సన్నీ డియోల్ సరసన సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింతా నటిస్తుండగా, శబానా అజ్మీ, అలీ ఫజల్, కరణ్ డియోల్, కనికా కపూర్, సర్గమ్ సింగ్, ఖుషీ హజారే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

