న్యూఢిల్లీ: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుపై ఇవాళ లోక్‌సభలో చర్చ మొదలైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(Union Minister Jitiendra Singh) మాట్లాడారు. పేపర్ లీకేజీ ఘటనల్లో కఠిన శిక్ష అమలు చేసేందుకు పేపర్ లీకేజీ నిరోధక బిల్లులో సవరణ చేపట్టినట్లు తెలిపారు. సెక్షన్ 10లోని సబ్‌సెక్షన్ 1 ప్రకారం లీకేజీ పాల్పడిన వ్యక్తికి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష ఉండేది. ఆ కేసుల్లో పది లక్షల జరిమానా కూడా ఉంది. అయితే సవరణ ద్వారా జైలుశిక్షను 5 నుంచి పదేళ్లకు మార్చారు. జరిమానాను 50 లక్షలకు పెంచారు. 2024 చట్టం ప్రకారం సర్వీస్ ప్రొవైడర్‌కు కోటి జరిమానా ఇస్తున్నారు. ఆ ఫైన్‌ను ఇప్పుడు 5 కోట్లకు పెంచారు. పరీక్షల నిర్వహణ నుంచి గతంలో 4 ఏళ్ల వరకు తప్పించేవారు. ఇప్పుడు సవరణ ద్వారా ఆ సమయాన్ని 8 ఏళ్లకు పెంచారు.
అయితే పేపర్ లీకేజీ కేసుల్లో వ్యవస్థీకృత నేరానికి పాల్పడే మాఫియాకు కూడా శిక్షా కాలాన్ని, జరిమానాను పెంచారు. గతంలో 5 నుంచి 10 వరకు ఉన్న జైలుశిక్షను ఇప్పుడు 7 నుంచి 10 ఏళ్ల వరకు పెంచారు. గతంలో ఆర్గనైజ్డ్ క్రైంకు పాల్పడితే కోటి జరిమానా విధించేవారు. ఇప్పుడు దాన్ని పది కోట్లకు సవరించినట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. వేగంగా న్యాయం అందించాలని ప్రధాని మోదీ చేసిన సూచన ప్రకారం.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటిల్లో టైం నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అయినా లేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయినా.. లీకేజీ కేసుల్లో దర్యాప్తును కేవలం 2 నెలల వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
#WATCH | On the Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026, Union Minister Jitiendra Singh says, “This amendment is being brought in to make the law more stringent and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and… pic.twitter.com/psOAHgggsw
— ANI (@ANI) July 28, 2026