Delhi Court Judge | ఢిల్లీ కోర్టు జడ్జి నోట 29 అక్షరాల మాట.. అర్థం కోసం ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్..!
Delhi Court Judge | ఢిల్లీ కోర్టు జడ్జి (Delhi Court Judge) గురువారం ఓ కేసు తీర్పులో ఏకంగా 29 అక్షరాల పొడవైన పదాన్ని ఉపయోగించారు. ఈ పదం అర్థం ఏమిటా అని నెటిజన్లు ఇంటర్నెట్ (Internet) లో జోరుగా వెతుకుతున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పై దాఖలైన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ఉపయోగించిన ఆ ఇంగ్లిష్ పదం ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.
Delhi Court Judge : ఢిల్లీ కోర్టు జడ్జి (Delhi Court Judge) గురువారం ఓ కేసు తీర్పులో ఏకంగా 29 అక్షరాల పొడవైన పదాన్ని ఉపయోగించారు. ఈ పదం అర్థం ఏమిటా అని నెటిజన్లు ఇంటర్నెట్ (Internet) లో జోరుగా వెతుకుతున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పై దాఖలైన పరువునష్టం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ఉపయోగించిన ఆ ఇంగ్లిష్ పదం ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. ఆ పదమే Floccinaucinihilipilification. ఈ పదాన్ని చూసి ఆశ్చర్యపోయిన నెటిజన్లు దాని అర్థమేంటీ..? ఎలా పలకాలి..? ఎక్కడ ఉపయోగిస్తారని నెట్టింట వెతుకుతున్నారు. ఇంతకీ ఆ పదం ఏంటి..? దాని అర్థం ఏంటి..? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నిర్మలా సీతారామన్‌పై ఆమ్ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి భార్య లిపికా మిశ్రా గతంలో పరువునష్టం దావా వేశారు. 2024 ఎన్నికల సమయంలో ఓ మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తమ వైవాహిక విభేదాలను ప్రస్తావిస్తూ పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని దావాలో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘ఫ్లాక్సినాసినిహిలపిలఫికేషన్ (Floccinaucinihilipilification)’ అనే పదాన్ని ప్రయోగించారు. లిపికా మిశ్రా ఆరోపణల్లో నిజం లేదని, ఈ పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదని జడ్జి అన్నారు.
కాగా ఈ Floccinaucinihilipilification అనే పదాన్ని ఏదైనా ఒక విషయాన్ని నిరుపయోగమైనదిగా పరిగణించే సమయంలో ఉపయోగిస్తారు. అంటే ఆ విషయం అంతగా విలువలేనిదని, పనికిరానిదని అర్థం. లాటిన్ మూలాల నుంచి ఈ పదం వచ్చింది. Flocci, nauci, nihili, pili అనే నాలుగు పదాలను కలిపి దీన్ని రూపొందించారు. వీటన్నింటి అర్థం ‘విలువ లేదు’ అని..! అయితే చూడటానికి చాలా పొడవుగా.. పలకడానికి చాలా క్లిష్టంగా ఉండటంతో రోజువారీ సంభాషణల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగించడం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఈ పదాన్ని మీరూ ఓసారి పలికి చూడండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

