నేడు వరంగల్‌కు కేటీఆర్
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం హనుమకొండ కేడీసీ మైదానంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న జనచైతన్య సభకు హాజరుకానున్నారు.
- కేడీసీ మైదానంలో జన చైతన్య సభకు హాజరు
- ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు
- బీఆర్ఎస్లో చేరనున్న ఏకశిలా విద్యాసంస్థల అధినేత
హనుమకొండ, నవంబర్ 21 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం హనుమకొండ కేడీసీ మైదానంలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న జనచైతన్య సభకు హాజరుకానున్నారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విసృ్తత ఏర్పాట్లు చేశారు. ఈ సభా వేదికగా ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. సభాస్థలిని పరిశీలించిన అనంతరం బీఆర్ నేతలు మీడియాతో మాట్లాడారు. హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెంది తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ చైతన్యం కల్పించడమే జన చైతన్య సభ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, ధర్మారెడ్డి, మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, ఎల్లావుల లలితాయాదవ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, బీఆర్ఎస్ నాయకులు మేడిపల్లి శోభన్, నయీమొద్దీన్, బీరెల్లి భరత్ కుమార్‌రెడ్డి, చింతం సదానందం, బండి రజినీకుమార్, శ్రీధర్, తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

