మహిళలకు ’చెయ్యి‘చ్చిన హిమాచల్ కాంగ్రెస్ సర్కార్
కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేకపోతున్నది.
సిమ్లా : కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోలేకపోతున్నది. ఇందిరా గాంధీ ప్యారీ బెహనా సుఖ్ సమ్మాన్ నిధి యోజన కింద గత మూడేండ్లలో వచ్చిన 8.25 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 93 శాతం అంటే 7.69 లక్షల దరఖాస్తులను తిరస్కరించింది. ఈ వివరాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కల్నల్ ధనీ రామ్ శాండిల్ శనివారం శాసన సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అర్హులైన మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేందుకు ఈ పథకం ద్వారా నెలకు రూ.1,500 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. పథకానికి అర్హులైన మిగిలిన మహిళలకు దశలవారీగా ప్రయోజనాలు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే, దీనికి గడువును వెల్లడించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

