వంద శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానలోనే చేయాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
వంద శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానాల్లోనే అయ్యే విధంగా వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.
రామన్నపేట, ఏప్రిల్ 02 : వంద శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానాల్లోనే అయ్యే విధంగా వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఫార్మసీ స్టోర్‌ను పరిశీలించి అన్ని మందులు ఉన్యాయా.. అన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆనంతరం రిజిస్ట్రేషన్, ఓపీ, ల్యాబ్‌ను పరిశీలించారు. దవాఖాన భవనంను, డ్రైనేజి వ్యవస్థను పరిశీలించి వెంటనే మరమతులు చేపట్టాలని టీఎస్ ఐఎండీసీ డీఈని ఆదేశించారు. దవాఖాన పరిధిలోని పీహెచ్‌సీల వైద్యులు. ఏఎన్ఎంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
గత సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో జరిగిన కాన్సుల వివరాలను పీహెచ్‌సీల వారీగా సమీక్షించారు. 50 శాతం కన్న ఎక్కువ కాన్పులు ప్రైవేటు దవాఖానాల్లోనే జరగడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. డీసీహెచ్, డీఎంహెచ్లు ప్రతినెల మొదటి వారంలో కాన్పులపై సమీక్ష సమావేశం నిర్వహించి రిపోర్టు తనకు అందజేయాలని ఆదేశించారు. దవాఖాన ప్రాగణంలో చెట్లను పెట్టి సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గరిక సత్యనారాయణకు సూచించారు. కలెక్టర్ వెంట డీసీ హెచ్ఎస్ చిన్నా నాయక్, బాఎంహెచ్ఓ మనోహార్, తాసీల్దార్ లాల్‌బహదూర్, ఎంపీడీఓ రాములు, దవాఖాన సూపరింటెండెంట్ శ్వేత ప్రియాంక ఉన్నారు.

వంద శాతం కాన్పులు ప్రభుత్వ దవాఖానలోనే చేయాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

