తాండూర్ : తాండూరు గ్రామంలో పేదింటి ఆడపడుచు కంపెల మమత వివాహానికి మాజీ ఎంపీపీ సిరంగి శంకర్ గురువారం రూ.5 వేల ఆర్ధిక సాయం ( Financial Assistance ) అందించి దాతృత్వం చాటుకున్నారు. సర్పంచ్ ముడిమడుగుల సురేష్ రూ.2 వేలు, ఉప సర్పంచ్ కుమ్మరి సత్యనారాయణ రూ.3వేలు, వార్డు సభ్యులు భాగ్యలక్ష్మి సారయ్య రూ. వెయ్యి సాయంగా అందించారు.
వార్డు సభ్యులు పెట్టెం విష్ణుకళ్యాణ్, ఎండీ జుబేర్, సింగరావ్ శ్రీధర్, పురంశెట్టి అరుణ్ పులగం శ్రీకాంత్ రూ. 5వేల ఎయిర్ కూలర్ విరాళంగా అందించి యువతి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ ఈసా, వార్డు సభ్యులు, నాయకులు, మైనార్టీ నాయకులు పాల్గొని వధువును ఆశీర్వదించారు.