Hyderabad | స్టేషన్కు వచ్చిన యువతిని లొంగదీసుకుని గర్భవతిని చేసిన ఇన్స్పెక్టర్.. వేధింపులు తాళలేక డీజీపీ ఫిర్యాదు
Hyderabad | ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతిని ఓ ఇన్స్పెక్టర్ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు రాకూడదని బలవంతంగా అబర్షాన్ కూడా చేయించాడు.
Hyderabad | ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతిని ఓ ఇన్స్పెక్టర్ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు రాకూడదని బలవంతంగా అబర్షాన్ కూడా చేయించాడు. అనంతరం డబ్బులు కావాలంటూ యువతిని వేధించి రూ. రెండు కోట్ల వరకు వసూలు చేశాడు. చివరకు బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ వ్యవహారం రెండేళ్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సదరు ఇన్స్పెక్టర్ గతంలో మరో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు యువతితో పరిచయం ఏర్పడింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతితో మాటలు కలిపి ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత శారీరకంగా లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు రాకూడదని బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు.
అప్పటి నుంచి సదరు యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తన ప్రైవేటు, లైంగిక వీడియోలను చిత్రీకరించిన ఇన్స్పెక్టర్ వాటిని బయటపెడతానంటూ బ్లాక్మెయిల్కు దిగాడు. బెదిరింపులకు పాల్పడుతూ ఇప్పటివరకు రూ.2 కోట్లు వసూలు చేశాడు. అయినప్పటికీ అతని వేధింపులు ఆగకపోవడంతో చివరకు బాధితురాలు డీజీపీ సీవీ ఆనంద్ను ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

