విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
ఈ సినిమా తాజా షెడ్యూల్ విశాఖపట్నంలో జరుగుతున్నది. సముద్రం నేపథ్యంలో కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, ఆయన లుక్స్ కూడా వైవిధ్యంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందిస్తున్నారు. ఇదిలా వుండగా ఈ నెల 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజుని పురస్కరించుకొని రెండు కొత్త చిత్రాల ప్రకటనలు ఉంటాయని సమాచారం.