పజ్జన్నకు బ్రహ్మరథం
కేంద్ర మంత్రిగా ఉండి నిధులు తేకుండా, ఉన్న నిధులు ఖర్చుచేయకుండా అభివృద్ధిని విస్మరించిన వ్యక్తికి ఓట్లు అడిగే అర్హత లేదని సికింద్రాబాద్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ అన్నారు.
- బన్సీలాల్‌పేట్ డివిజన్లో జోరుగా పద్మారావుగౌడ్ ప్రచారం
- అడుగడుగునా మంగళహారతులతో బ్రహ్మరథం పట్టిన మహిళలు
- కిషన్ రెడ్డి.. ఎంపీగా గెలిపించి..కేంద్ర మంత్రిని చేస్తే.. ఏం చేశావ్
- నిధులు తేలేవు.. ఉన్న నిధులు ఖర్చు పెట్టలే
- జైశ్రీరామ్, మోదీ పేరు ఎందుకు.. చేసిన అభివృద్ధి చెప్పు
- అభివృద్ధిని విస్మరించిన కిషన్ రెడ్డికి మళ్లీ ఎలా ఓటువేస్తారు..
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు
- బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి
- భారీ మెజార్టీతో విజయం సాధిస్తా
- సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్
బన్సీలాల్‌పేట్, మే 7 : కేంద్ర మంత్రిగా ఉండి నిధులు తేకుండా, ఉన్న నిధులు ఖర్చుచేయకుండా అభివృద్ధిని విస్మరించిన వ్యక్తికి ఓట్లు అడిగే అర్హత లేదని సికింద్రాబాద్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ అన్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్ పార్టీనుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తిని ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌లోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలిచిందని, ఆ లెక్కన భారీ మెజారిటీతో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ మంగళవారం బన్సీలాల్‌పేట్ డివిజన్లో ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా బోలక్‌పూర్‌లోని శ్రీమల్లికార్జునస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుండి కృష్ణానగర్ కాలనీ, బోలక్పూర్, ఆంజనేయస్వామి కాలనీ, ఐడీహెచ్ డబుల్ బెడ్రూమ్ కాలనీ, గొల్లకొమరయ్య కాలనీ వరకు ర్యాలీ కొనసాగింది.
అడుగడుగునా వారికి అన్ని బస్తీలలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఐడీహెచ్ కాలనీలో బన్సీలాల్‌పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఇక్కడ గెలిచి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి చేసిన అభివృద్ధి కాకుండా జైశ్రీరామ్, మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని, ఎంపీగా కేంద్రం నుంచి నిధులు తేలేదని, ఉన్న నిధులను కూడా ఖర్చు చేయలేకపోయారని విమర్శించారు. అలాంటి వారికి ప్రజలు మళ్లీ ఎలా ఓటువేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు పార్టీ మారాడని, అలాంటి వారిని ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించి, సికింద్రాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. ఈ పాదయాత్రలో సనత్‌నగర్ ఎన్నికల ఇన్చార్జి బి.వెంకట్‌రెడ్డి, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కె.హేమలత, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్చార్జి జీ.పవన్‌కుమార్ గౌడ్, నాయకులు ఏసూరి మహేశ్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, కార్యదర్శి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

