Vitamin D | విటమిన్ డి కేవలం సూర్యరశ్మి ద్వారానే కాదు.. ఈ ఆహారాలతోనూ లభిస్తుంది..
విటమిన్ డి శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. దీనిని సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. భారత్ లో ఏడాది పొడవునా సమృద్ధిగా సూర్యరశ్మి లభించినప్పటికీ విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ లోపాన్ని అధిగమించేందుకు చాలా మంది సప్లిమెంట్లను ఆశ్రయిస్తుంటారు.
Vitamin D | విటమిన్ డి శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. దీనిని సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. భారత్ లో ఏడాది పొడవునా సమృద్ధిగా సూర్యరశ్మి లభించినప్పటికీ విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ లోపాన్ని అధిగమించేందుకు చాలా మంది సప్లిమెంట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే సూర్యరశ్మితోపాటు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పుణెలోని జహంగీర్ ఆస్పత్రి, ఇంగ్లాండ్‌లోని రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 200 మందికిపైగా పురుషులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో కనీసం ఆరు నెలల పాటు ఎక్కువ సమయం సూర్యరశ్మిలో గడిపిన వారిలో విటమిన్ డి స్థాయిలు పెరగడంతోపాటు మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గినట్లు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమయ్యాయి.
పాలలో పుష్కలంగా పోషకాలు..
అయితే సూర్యరశ్మిలో ఎక్కువసేపు ఉండటం వల్ల డీహైడ్రేషన్, చర్మం నల్లబడటం, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల పరిమితంగా సూర్యరశ్మిని పొందడంతోపాటు విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చుకోవడం ఉత్తమం. పాలు విటమిన్ డికి మంచి మూలంగా చెప్పవచ్చు. రోజూ ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాస్ పాలను తాగితే రోజువారీ అవసరంలో సుమారు 20 శాతం వరకు విటమిన్ డి లభిస్తుంది. సాధ్యమైనంత వరకు పూర్తి కొవ్వు (హోల్ ఫ్యాట్) పాలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే స్కిమ్డ్ మిల్క్‌లో కొవ్వుతోపాటు కొంత విటమిన్ డి కూడా తగ్గిపోతుంది. అయితే ప్రస్తుతం కొన్ని బ్రాండ్లు విటమిన్ డి కలిపిన స్కిమ్డ్ మిల్క్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి.
నారింజ రసం..
నారింజలో అనేక పోషకాలు ఉండటంతోపాటు విటమిన్ డి కూడా లభిస్తుందని చాలా మందికి తెలియదు. రోజును ఒక గ్లాస్ తాజా నారింజ రసంతో ప్రారంభించడం ఆరోగ్యానికి మంచిది. అయితే ప్యాకెట్లలో లభించే జ్యూస్‌కు బదులుగా తాజాగా తయారుచేసిన నారింజ రసాన్ని తీసుకోవడం ఉత్తమం. సాల్మన్ చేపను విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాల్లో ఒకటిగా పేర్కొంటారు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ డి లభించడంలో సహాయపడతాయి. తాజాగా లభించిన లేదా సహజ వాతావరణంలో పెరిగిన సాల్మన్ చేపను తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. పుట్టగొడుగులు (మష్రూమ్స్) విటమిన్ డి కలిగిన ఏకైక మొక్కల ఆధారిత ఆహారంగా గుర్తింపు పొందాయి. ఇవి సూర్యరశ్మిలో పెరగడం వల్ల సహజంగానే విటమిన్ డిని గ్రహిస్తాయి. అంతేకాకుండా వీటిలో విటమిన్ బి1, బి2, బి5తోపాటు రాగి వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే మష్రూమ్స్‌లో విటమిన్ డి పరిమాణం వాటి రకం, సాగు విధానాన్ని బట్టి మారుతుంది. సహజ సూర్యరశ్మిలో ఎండబెట్టిన మష్రూమ్స్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది. అవసరమైతే తాజా మష్రూమ్స్‌ను కూడా కొంతసేపు ఎండలో ఉంచి వాటిలో విటమిన్ డి పరిమాణాన్ని పెంచుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

