Karoline Leavitt | ‘పెళ్లిళ్లు చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కనండి’.. అమెరికా యువతకు కరోలిన్ లీవిట్ పిలుపు..!
Karoline Leavitt | రానున్న పదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం అవతరించనుందని ఇటీవల వచ్చిన ఓ నివేదికపై వైట్‌హౌస్ (White House) మాజీ ప్రెస్ సెక్రటరీ (Ex Press Secretary) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) స్పందించారు. ఈ నివేదిక నేపథ్యంలో క్రిస్టియన్ జనాభా పెరుగుదలకు సంబంధించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Karoline Leavitt : రానున్న పదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం అవతరించనుందని ఇటీవల వచ్చిన ఓ నివేదికపై వైట్‌హౌస్ (White House) మాజీ ప్రెస్ సెక్రటరీ (Ex Press Secretary) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) స్పందించారు. ఈ నివేదిక నేపథ్యంలో క్రిస్టియన్ జనాభా పెరుగుదలకు సంబంధించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లిళ్లు చేసుకొని ఎక్కువ మంది పిల్లలను కనాలని అమెరికా యువత (American Youth) కు పిలుపునిచ్చారు.
క్రైస్తవాన్ని అధిగమించి 2035 కల్లా ప్రపంచంలో అతిపెద్ద మతంగా ఇస్లాం అవతరించనుందని ‘ఫ్యూ రిసెర్చ్ సెంటర్ (Pew Research Center)’ అంచనా వేసింది. ఇస్లాం, క్రైస్తవం రెండు మతాల్లో జనాభా పెరుగుతున్నప్పటికీ ముస్లింల జనాభా చాలా వేగంగా పెరుగుతున్నదని ఆమె చెప్పారు. దీనికి సంబంధించి వాషింగ్టన్ పోస్ట్‌లో వచ్చిన కథానాన్ని లీవిట్ ప్రస్తావించారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని అమెరికా యువతను కోరారు. పిల్లలకు అమెరికాపట్ల ప్రేమను పెంపొందించాలని సూచించారు.
కాగా, కరోలిన్ లీవిట్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తున్నది. కొందరు నెటిజన్లు ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా యూజర్లు మాత్రం అమెరికాలో పెరుగుతున్న జీవనవ్యయం వల్ల యువ కుటుంబాలు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని కామెంట్ చేశారు. పిల్లల పోషణ భారంగా మారిందనే పిల్లలను కనడానికి యువత భయపడుతోందని పేర్కొంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karoline Leavitt | ‘పెళ్లిళ్లు చేసుకుని ఎక్కువ మంది పిల్లలను కనండి’.. అమెరికా యువతకు కరోలిన్ లీవిట్ పిలుపు..!
Manne Krishank | ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి.. మెటా క్యాంపస్ ఘటనపై మన్నె క్రిశాంక్
Phule Movie | తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’.. నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్!
Plastic Bottle | ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను మళ్లీమళ్లీ వాడుతున్నారా.. వాటిపై టాయిలెట్ కుండీల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట..!
Nuvvu Rammante | శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ చేతుల మీదుగా ‘నువ్వు రమ్మంటే’ ఫోక్ సాంగ్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

