Nuvvu Rammante | శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ చేతుల మీదుగా ‘నువ్వు రమ్మంటే’ ఫోక్ సాంగ్ విడుదల!
Nuvvu Rammante | ఆయాతి క్రియేషన్స్ పతాకంపై ఢీ అభి, నైనిక అనసురు, 'రాను బొంబాయికి రాను' ఫేమ్ లిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన పాట 'నువ్వు రమ్మంటే'.
ఆయాతి క్రియేషన్స్ పతాకంపై ఢీ అభి, నైనిక అనసురు, ‘రాను బొంబాయికి రాను’ ఫేమ్ లిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన పాట ‘నువ్వు రమ్మంటే’. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించడం విశేషం. సంధ్యా శ్రీధర్ కంతేటి నిర్మించిన ఈ పాటకు కుమార్. జి. దర్శకత్వం వహించగా, కల్యాణ్ కీస్ సంగీతం సమకూర్చారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పాట విడుదల వేడుకకు ప్రముఖ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, రామ్ రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో గాయకుడు రామ్ రాథోడ్ మాట్లాడుతూ.. ఈ పాట లాంఛ్‌కు అతిథిగా ఆహ్వానించడం సంతోషంగా ఉందని, గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్లతో వేదిక పంచుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ స్ఫూర్తితోనే తాను ఫోక్ సాంగ్స్ చేయడం మొదలుపెట్టానని, ఈ పాట పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. నిర్మాత సంధ్యా శ్రీధర్ కంతేటి మాట్లాడుతూ.. తాను పవన్ కల్యాణ్ అభిమానినని, ఆయన సినిమాల్లోని ఫోక్ సాంగ్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. అలాంటి పాట చేయాలనుకున్నప్పుడు బ్యానర్ పెట్టడం, ప్రొడక్షన్ విషయాలపై తనకు అవగాహన లేకపోయినా, గణేష్ మాస్టర్, లిఖిత సహకారంతో అన్నీ చక్కగా కుదిరాయని, ఈ పాట తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
నటి లిఖిత మాట్లాడుతూ.. ‘నువ్వు రమ్మంటే’ పాటలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారని తెలిసిన వెంటనే అంగీకరించానని, ప్రేక్షకులు ఈ పాటను ఆదరించాలని కోరారు. హీరో ఢీ అభి మాట్లాడుతూ.. తనకు ఇది మొదటి ఫోక్ సాంగ్ అని, తన అభిమాన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ అతిథులుగా రావడం సంతోషంగా ఉందన్నారు. ఎంతోమంది స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టర్ తన పాటకు కొరియోగ్రాఫ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ పాట అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పారు.
గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండిపెండెంట్ మ్యూజిక్కు మంచి ఆదరణ లభిస్తోందని, ఈ పాట చాలా బాగుందని, కల్యాణ్ కీస్ చక్కని సంగీతం అందించారని ప్రశంసించారు. పాట కాన్సెప్ట్ క్రెడిట్ గణేష్ మాస్టర్‌కే దక్కుతుందని, ఈ పాట బృందంలోని అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు. భాను మాస్టర్ మాట్లాడుతూ.. తన గురువు గణేష్ మాస్టర్ తనను అతిథిగా పిలవడం సంతోషంగా ఉందని, కళను ప్రేమించే వ్యక్తి కాబట్టే స్టార్ హీరోలతో సినిమాలు చేసినా కొత్త బృందంతో ఫోక్ సాంగ్ చేశారని, పాట బాగుందని, బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘నువ్వు రమ్మంటే’ పాట చాలా బాగుందని, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో సృజనాత్మకత ఉంటుందని, కొత్త స్టెప్స్, కొత్త కాన్సెప్ట్‌తో పాట ఆకట్టుకుంటోందన్నారు. ఇదే పాట కమర్షియల్ సినిమాలో ఉంటే కోట్ల రూపాయలు తెచ్చిపెడుతుందని కొనియాడారు. గణేష్ మాస్టర్‌తో పని చేయడం అభి అదృష్టమని, ఈ పాటతో అభికి హీరోగా మంచి గుర్తింపు రావాలని, లిఖిత అందంగా ఉండి బాగా నటించారని, నైనికతో పాటు బృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. చివరగా గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. తన మిత్రులు శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ లాంఛ్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత సంధ్యా శ్రీధర్ ఇచ్చిన మద్దతు వల్లే ఈ పాట సాధ్యమైందని, కల్యాణ్ కీస్ అద్భుతంగా కంపోజ్ చేశారని, అభి ఎంతో కష్టపడ్డారని, లిఖిత అడగగానే ముందుకొచ్చారని తెలిపారు. ఈ పాట ప్రేక్షకులందరికీ నచ్చాలని కోరుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuvvu Rammante | శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ చేతుల మీదుగా ‘నువ్వు రమ్మంటే’ ఫోక్ సాంగ్ విడుదల!
YS Jagan | ప్రతి మత్స్యకార కుటుంబానికి అండగా ఉంటా : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
Watch: పార్కులో జంటపై ముస్లిం బాలురు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?
Jana Chaitanya Sabha | జన చైతన్య సభను జయప్రదం చేయాలి : బీఆర్ఎస్ నాయకుల పిలుపు
Crime News | రైలుబోగీలో మహిళపై హత్యాచారం కేసు.. బంగారు ఉంగరం ఆధారంగా మృతురాలి గుర్తింపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

