PhD Student Died | ట్రెక్కింగ్‌కు వెళ్లిన భారత సంతతి పీహెచ్డీ విద్యార్థి మృతి..!
PhD Student Died : పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లిన భారత సంతతికి చెందిన విక్రమ్ ముబాయి(Vikram Mubayi) జీవితం విషాదంగా ముగిసింది. రెండు రోజుల క్రితం ఒంటరిగా ట్రెక్కింగ్‌కు వెళ్లిన అతడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు.
PhD Student Died : పీహెచ్డీ కోసం అమెరికా వెళ్లిన భారత సంతతికి చెందిన విక్రమ్ ముబాయి(Vikram Mubayi) జీవితం విషాదంగా ముగిసింది. రెండు రోజుల క్రితం ఒంటరిగా ట్రెక్కింగ్‌కు వెళ్లిన అతడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్న అతడు విగతజీవిగా కనిపించాడు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. విక్రమ్ మృతిపై తమకు ఎలాంటి సందేహాలు లేవని అధికారులు తెలిపారు.
సాంటాబర్బరాలోని క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేస్తున్న విక్రమ్ ముబాయి రెండు రోజుల క్రితం హైకింగ్(అడవులు, కొండ ప్రాంతాలు, పర్వతాల గుండా నడవడం)కు వెళ్లాడు. వారాంతం కాబట్టి ఆగస్టు 1వ తేదీన ఒంటరిగా పైన్ లేక్స్ ప్రాంతంలో హైకింగ్‌కు వెళ్లిన అతడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. విక్రమ్ నుంచి ఫోన్ రాకపోవడంతో అప్రమత్తమైన అతడి కుటుంబసభ్యులు, స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో, అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలించారు.
Vikram Mubayi, a Ph.D. student in UCSB’s Department of Chemical Engineering, had set out on a solo backpacking trip in the Big Pine Lakes area over the weekend. He last communicated with his family at around 8:30 p.m. on Saturday, August 1, sharing his GPS coordinates while on… pic.twitter.com/Mqb3BuBJRl
— NRI Pulse (@NRIPulse) August 5, 2026
చివరు రెండు రోజుల తర్వాత ఆగస్టు 3 న హైకింగ్‌కు వెళ్లిన పైన్ లేక్స్లోనే విక్రమ్ మృతదేహం లభించింది. విక్రమ్ సోదరుడు ‘రెడ్డిట్'(Reddit) పోస్ట్ ప్రకారం అతడు ఆగస్టు 1వ తేదీన పైన్ లేక్స్ ప్రాంతం నుంచి రాత్రి 830 గంటల సమయంలో కుటుంబసభ్యులకు ఫోన్ చేశాడు. అతడు మాట్లాడుతుండగానే జీపీఎస్ కనెక్షన్ కట్ అయింది. అయితే.. కాసేపటికి విక్రమ్ తమతో మాట్లాడుతాడని వారు అనుకున్నారు. కానీ, అతడు ఫోన్ చేయలేదు. దాంతో.. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

