Breaking News | ప్రభుత్వానికి షాక్..మూసాపేట, నియోపోలీస్ భూముల వేలం రద్దు
Breaking News | కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వ భూముల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు వమ్ము అయ్యాయి.
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వ భూముల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు వమ్ము అయ్యాయి. నగరంలోని నడిబొడ్డున ఉన్న భూములతో పాటు శివారులో ఉన్న భూములను విక్రయించడానికి ప్రభుత్వం వేలానికి సిద్ధమయ్యింది. ఇందులో భాగంగా మూసాపేట( Moosapet) , కోకాపేట నియోపోలీస్( Neopolis ) భూముల వేలానికి టెండర్లు ఆహ్వానించింది.
శుక్రవారం టెండర్లకు గడువు విధించగా ఇన్వెస్టర్లు, రియల్టర్లు, బిడ్డర్లు ఎవ్వరూ కూడా ముందుకు రాకపోవడం, ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో వేలాన్ని రద్దు ( Cancell) చేసింది. మూసాపేటలో 3.15 ఎకరాల భూమి ఎకరాకు కనీస ధర రూ.99 కోట్లు , కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో 4.59 ఎకరాల భూమి ఎకరాకు కనీస ధర రూ.120 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది.ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో వేలం రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. భూముల వేలం ద్వారా వందల కోట్లు సంపాదించుకోవచ్చని భావించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురయ్యింది .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breaking News | ప్రభుత్వానికి షాక్..మూసాపేట, నియోపోలీస్ భూముల వేలం రద్దు
‘దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయండి’
‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్లో గర్ల్ఫ్రెండ్కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

