‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
ములకలపల్లి మండల పరిధిలోని జగన్నాధపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ కుంజా వినోద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలు...
ములకలపల్లి, నవంబర్ 27 : ములకలపల్లి మండల పరిధిలోని జగన్నాధపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ కుంజా వినోద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులే దేశ భవిష్యత్‌కు పునాదులని, ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయులు సొంత పిల్లలుగా భావించి ప్రేమతో, బాధ్యతతో చూసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందించే గొప్ప వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేకుర్తి రామాచారి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి : డీఏఓ వి.బాబురావు
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
బాల్య వివాహాల నిర్మూలనపై ఎంజీయూలో అవగాహన కార్యక్రమం
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

