Argentina Football | చరిత్రకెక్కిన సెమీస్ విజయం.. భావితరాలు గుర్తుంచుకునేలా ప్రత్యేక దినోత్సవం..!
Argentina Football : ఫిఫా వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయాన్ని భావి తరాలు గుర్తుంచుకునేలా కీలక ప్రకటన చేసింది అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య(AFA).
Argentina Football : వరసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను ముద్దాడాలనుకున్న అర్జెంటీనా(Argentina) కల చెదిరినా చివరకు చరిత్రాత్మక గుర్తింపు లభించింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయాన్ని భావి తరాలు గుర్తుంచుకునేలా కీలక ప్రకటన చేసింది అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య(AFA). మాజీ ఛాంపియన్‌పై సూపర్ విక్టరీ రోజును ‘జాతీయ ఫుట్‌బాల్ జట్ల దినోత్సవం’గా ప్రకటించింది ఏఎఫ్ఏ. ఈ విషయాన్ని గురువారం అర్జెంటీనా ఫుట్‌బాల్ వెల్లడించింది.
ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ అనంతరం వివాదాస్పద ప్రవర్తనతో అర్జెంటీనా జట్టు విమర్శల పాలైన విషయం తెలిసిందే. అయితే.. అర్జెంటీనా ప్రభుత్వం, ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య మాత్రం తమ ఆటగాళ్ల తప్పేమీ లేదని మద్దతు తెలిపింది. జూలై 15న సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయాన్ని కలకాలం గుర్తిండిపోయేలా ప్రత్యేకంగా మార్చేసింది ఏఎఫ్ఏ. జూలై 15వ తేదీని నేషనల్ ఫుట్‌బాల్ టీమ్స్ డేగా ప్రకటించింది.
The Argentine FA have announced that July 15 will be ‘National Football Teams Day.’
The date was chosen to celebrate their win over England in the 2026 World Cup semifinal 🇦🇷 pic.twitter.com/9OmQHiYsnF
— B/R Football (@brfootball) August 6, 2026
‘జూలై 15వ తేదీన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై అల్బీసెలెస్టెస్ విజయం చరిత్రాత్మకమైనది. లియోనల్ స్కలోని నేతృత్వంలో ఆడిన జట్టుకు కీలక గోల్స్ అందించిన .. ఎన్జో ఫెర్నాండేజ్, లాటరో మార్టినెజ్‌కు ధన్యవాదాలు. వీరిద్దరి గోల్స్‌తో అర్జెంటీనా ముందంజ వేసింది. దేశ ప్రజలు రోడ్లమీదకు వచ్చి సంబురాలు చేసుకున్నారు. అందుకే ఈ రోజు చాలా ప్రత్యేకం. అందుకే.. నేషనల్ ఫుట్‌బాల్ టీమ్స్ డేగా ప్రకటిస్తున్నాం. ఇకపై ఏటా జూలై 15ను ఈ దినోత్సవంగా నిర్వహిస్తాం’ అని అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య వెల్లడించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన సెమీస్‌లో లియోనల్ మెస్సీ బృందం 2-1తో ఇంగ్లండ్‌ను ఓడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

