ఉప్పల్ భగాయత్‌లో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మహ్మద్ మునాజిర్ (34) యమహా ఎఫ్‌జెడ్ బైక్‌పై ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్ నుంచి నాగోల్ వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో శ్రీపూజ గ్లాస్ హార్డ్‌వేర్ దుకాణం ఎదురుగా బైక్ అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్‌పై ఉన్న మునాజిర్తో పాటు వెనుక కూర్చున్న మహ్మద్ సలావుద్దీన్ (35) మృతి చెందాడు. సలావుద్దీన్ గుజరాత్‌లోని భరూచ్‌కు చెందిన కార్మికుడు. ప్రస్తుతం ఉప్పల్ భగాయత్‌లోని జైన్ భవన్లో నివాసం ఉంటున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉప్పల్ భగాయత్‌లో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి
KTR | గూండాయిజంతోనే కంపెనీలను భారత్‌కు తీసుకొస్తారా.. రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
HBA1C | 3 నెలల సగటు చక్కెర స్థాయిలను తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్ష నిజమైన ఫలితాలనే ఇస్తుందా..?
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’కి ఊహించని ఓపెనింగ్స్.. తొలి రోజే షాక్!
Allu Aravind | అల్లు సినిమాస్‌లో టికెట్ల బ్లాకింగ్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.. వెంటనే వీడియో కాల్ చేసిన అల్లు అరవింద్,అక్కడికక్కడే కీలక నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

