HBA1C | 3 నెలల సగటు చక్కెర స్థాయిలను తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్ష నిజమైన ఫలితాలనే ఇస్తుందా..?
మధుమేహాన్ని గుర్తించేందుకు వైద్యులు సాధారణంగా సూచించే పరీక్షల్లో హెచ్‌బీఏ1సీ ముఖ్యమైనది. గత రెండు నుంచి మూడు నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయిలను ఈ పరీక్ష తెలియజేస్తుంది. అయితే ఈ పరీక్ష ఫలితం అన్ని సందర్భాల్లోనూ కచ్చితంగా ఉంటుందని చెప్పలేం.
HBA1C | మధుమేహాన్ని గుర్తించేందుకు వైద్యులు సాధారణంగా సూచించే పరీక్షల్లో హెచ్‌బీఏ1సీ ముఖ్యమైనది. గత రెండు నుంచి మూడు నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయిలను ఈ పరీక్ష తెలియజేస్తుంది. అయితే ఈ పరీక్ష ఫలితం అన్ని సందర్భాల్లోనూ కచ్చితంగా ఉంటుందని చెప్పలేం. రక్తహీనత, ఇనుము లోపం, వంశపారంపర్యంగా వచ్చే హిమోగ్లోబిన్ మార్పులు వంటి పరిస్థితులు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో కొందరిలో మధుమేహం ఉన్నా సాధారణ ఫలితం వస్తుంది. మరికొందరిలో వ్యాధి లేకపోయినా అధిక స్థాయిలు కనిపిస్తాయి.
హెచ్‌బీఏ1సీ అంటే..
ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌కు ఎంత గ్లూకోజ్ అంటుకుని ఉందో హెచ్‌బీఏ1సీ పరీక్ష కొలుస్తుంది. సాధారణంగా ఈ కణాలు సుమారు 120 రోజులు జీవిస్తాయి. అందుకే గత రెండు, మూడు నెలల సగటు చక్కెర స్థాయిని అంచనా వేయవచ్చు. 5.7 శాతం కంటే తక్కువ ఉంటే సాధారణ స్థాయి, 5.7 నుంచి 6.4 శాతం మధ్య ఉంటే మధుమేహానికి ముందు దశ, 6.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మధుమేహ సూచనగా పరిగణిస్తారు. అయితే హిమోగ్లోబిన్లో వచ్చే కొన్ని వంశపారంపర్య మార్పులు పరీక్ష ఫలితాన్ని తప్పుదోవ పట్టిస్తాయి. భారత్‌లో కనిపించే హెచ్‌బీఈ, హెచ్‌బీడీ-పంజాబ్, హెచ్‌బీఎస్ వంటి రకాలు ఈ సమస్యకు కారణం అయ్యే అవకాశం ఉంది. ఇనుము లోపం వల్ల కూడా హెచ్‌బీఏ1సీ స్థాయి వాస్తవానికి మించినట్లు కనిపించే వీలు ఉంటుంది.
ఎలా పరీక్ష చేస్తారు..
పరీక్షలో ఉపయోగించే విధానం కూడా కీలకమే. హెచ్పీఎల్సీ పద్ధతి ద్వారా చక్కెర స్థాయిని అంచనా వేయడంతో పాటు కొన్ని అసాధారణ హిమోగ్లోబిన్ రకాలను గుర్తిస్తుంది. అయితే నివేదికలోని వివరాలను నిపుణులు జాగ్రత్తగా పరిశీలించాలి. రక్తహీనత, ఇటీవల రక్తస్రావం లేదా ఎర్ర రక్తకణాలు త్వరగా నశించే సమస్యలు ఉంటే హెచ్‌బీఏ1సీ ఫలితం తక్కువగా వస్తుంది. అందువల్ల పరీక్ష ఫలితాలు లక్షణాలకు సరిపోకపోతే వైద్యులు ఇతర పరీక్షలను సూచిస్తారు.
ఇతర పరీక్షలూ కీలకమే..
అలాంటి సందర్భాల్లో కనీసం ఎనిమిది గంటలు ఉపవాసం తర్వాత చేసే రక్తంలో చక్కెర పరీక్ష, 75 గ్రాముల గ్లూకోజ్ ద్రావణం తాగిన రెండు గంటల తర్వాత చేసే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్ష ఉపయోగపడతాయి. వీటిలో వరుసగా 126 మి.గ్రా./డెసిలీటర్, 200 మి.గ్రా./డెసిలీటర్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలు మధుమేహ సూచనగా పరిగణిస్తారు. ఫ్రక్టోసమైన్ పరీక్ష గత రెండు, మూడు వారాల సగటు చక్కెర స్థాయిని తెలియజేస్తుంది. అయితే ఇది ప్రధానంగా పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. కాబట్టి హెచ్‌బీఏ1సీ ఫలితాన్నే అంతిమంగా భావించకుండా, అవసరమైతే ఇతర పరీక్షలతో నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HBA1C | 3 నెలల సగటు చక్కెర స్థాయిలను తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్ష నిజమైన ఫలితాలనే ఇస్తుందా..?
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’కి ఊహించని ఓపెనింగ్స్.. తొలి రోజే షాక్!
Allu Aravind | అల్లు సినిమాస్‌లో టికెట్ల బ్లాకింగ్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.. వెంటనే వీడియో కాల్ చేసిన అల్లు అరవింద్,అక్కడికక్కడే కీలక నిర్ణయం!
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

