iQoo Z9x 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ తన ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ ఫోన్‌ను ఈ నెల 16న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఐక్యూ ఇండియా సీఈఓ నిపుణ్ మార్యా ఈ మేరకు ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లను బయట పెట్టారు. చైనాలో ఆవిష్కరించిన ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ ఫీచర్లతోనే భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని తెలిపారు. ఈ మేరకు నిఫుణ్ మార్యా తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. ఈ నెల 16న భారత్ మార్కెట్లో ఐక్యూ జడ్9ఎక్స్ 15 ఫోన్‌ను ఆవిష్కరిస్తామని బయట పెట్టారు. ఈ ఫోన్ ఫీథర్ లైక్ ప్యాటర్న్‌తో లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌తో వస్తుందని తెలుస్తున్నది. టాప్ లెఫ్ట్ కార్నర్లో స్వల్పంగా రౌండెడ్ ఎడ్జెస్‌తో కెమెరా మాడ్యూల్ పెంచారు. రెండు కెమెరా సెన్సర్లు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి.
భారత్ మార్కెట్లో ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ ఫోన్ విక్రయిస్తామని ఐక్యూ ఇండియా సీఈఓ నిపుణ్ మార్య ధృవీకరించారు. ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ చైనా వేరియంట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్, 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. ఈ ఫోన్ ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తో కూడిన 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 120 హెర్జ్స్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంటది. ఈ ఫోన్లో సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఒర్జిన్ ఓఎస్ 4 వర్షన్‌పై పని చేస్తుంది. చైనాలో ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.15,000 (1299 చైనా యువాన్లు) పలుకుతుంది. డార్క్ నైట్, ఫెంగ్ యుకింగ్, స్టార్ బస్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.