Sridhar Gande | కేసీఆర్‌ను అడ్డుకునేందుకు ఒక్కటైన బడేమియా.. చోటేమియా: స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నేత శ్రీధర్ గందె
తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, బీఆర్ఎస్ అధినే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటలపాటు నిలిపివేయడాన్ని స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ గందె (Sridhar Gande) ఖండించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, బీఆర్ఎస్ అధినే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని 48 గంటలపాటు నిలిపివేయడాన్ని స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్ గందె (Sridhar Gande) ఖండించారు. గత రెండు వారాలుగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ ఉపయోగించిన అభ్యంతరకర భాష కనపడని ఈసీ.. కేవలం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. బీఆర్ఎస్ అధినేత బస్సుయాత్రకు వస్తున్న జనప్రభంజనం చూసి హైదరాబాద్, ఢిల్లీ నేతల కుర్చీలు కదిలిపోతున్నట్టున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను అడ్డుకునేందుకు బడేమియా, చోటేమియా ఒక్కటై ఆడున్న ఆట ఇదని విమర్శించారు.
అదేవిధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ అరెస్టు దురుద్దేశ పూరితమైనదని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ చారిత్రక తీర్పు దిశగా సాగుతున్నదని, నాలుగు నెలల కాంగ్రెసు పాలనలో ప్రజలు విసిగి పోయారని చెప్పారు. కేసీఆర్ పాలన లేకపోవడంతో ప్రజలు బాధపడుతున్నారని.. కుహనా మేధావులు, రాజకీయ నిరుద్యోగుల దుష్ప్రచారాలు నమ్మి తమ వేలితో తమ కన్నునే పొడుచుకున్నామని తెలుసుకున్నారని వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీజేపీలకు గూబగుయ్యుమనేలా ఉంటాయని చెప్పారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

