ఢిల్లీ: సొంతగడ్డపై బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఈనెల 17 నుంచి ఢిల్లీ వేదికగా జరుగబోయే ఈ టోర్నీ కోసం మంగళవారం నిర్వహించిన డ్రాలో షట్లర్లకు సీడింగ్స్ కేటాయించారు. భారత డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి ఐదో సీడ్ దక్కగా మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్‌కు 14వ, మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్-తనీష్టా 15వ సీడ్ దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ చాంప్ షి యుకీ (చైనా), విమెన్స్ సింగిల్స్‌లో అన్ సె యాంగ్ (దక్షిణ కొరియా) టాప్ సీడ్స్గా పోటీపడనున్నారు.