iPhone 15 Pro Max | మార్చి త్రైమాసికంలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్ ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్.. ఎందుకంటే..?!
iPhone 15 Pro Max | జనవరి-మార్చి త్రైమాసికంలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ నిలిచిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది.
iPhone 15 Pro Max | రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నా.. ఆపిల్ ఐ-ఫోన్కు ఉండే ప్రత్యేకత డిఫరెంట్. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో అమ్ముడైన టాప్-10 స్మార్ట్ ఫోన్లలో ఆపిల్, శాంసంగ్ ఫోన్లు ఉన్నాయి. టాప్-10 ఫోన్లలో ఏడు హై ఎండ్ ఫోన్లంటే అతిశయోక్తి కాదు. అన్ని ఫోన్లూ 5జీ సామర్థ్యం గలవేనని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నిర్వహించిన ‘గ్లోబల్ మంత్లీ హ్యాండ్ సెట్ మొబైల్స్ సేల్స్ ట్రాకర్ నివేదిక వెల్లడించింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, స్టాండర్డ్ ఐ-ఫోన్ 15 ఫోన్లు మొదటి, రెండవ స్థానాల్లో నిలిచాయి. ఐఫోన్ 15 ప్రో మూడో, ఐఫోన్ 14 నాలుగో స్థానంలో నిలిస్తే, ఐఫోన్ 15 ప్లస్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.
ఆపిల్ ఐఫోన్ల తర్వాత ఐదు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అమ్ముడైనవి శాంసంగ్ ఫోన్లే. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా ఐదో స్థానంలో, శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ ఆరవ, శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ ఫోన్ ఏడో స్థానంలో నిలిచాయి. స్టాండర్డ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ తొమ్మిదో స్థానంలో నిలిస్తే, శాంసంగ్ గెలాక్సీ ఏ34 పదో స్థానానికి పరిమితమైంది.
ఆపిల్ ఐఫోన్15, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో మెరుగైన హార్డ్ వేర్ వినియోగించారు. న్యూ యాక్షన్ బటన్, పవర్ ఫుల్ ఏ17 ప్రో చిప్, టెలిఫోటో కెమెరా, టైటానియం బాడీ వంటి ఫీచర్లు జత చేశారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ స్మార్ట్ ఫోన్లలో `సర్కిల్ టు సెర్చ్`, ‘బ్రౌజింగ్ అసిస్ట్’, ‘రియల్ టైం ట్రాన్స్ లేషన్ ఫర్ కాల్స్` వంటి న్యూ జనరేటివ్ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఇక ముందు స్మార్ట్ ఫోన్లలో జనరేటివ్ ఏఐ ఫీచర్ ప్రీమియం ఫీచర్గా ఉంటుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

