తిరుమల : తిరుమల (Tirumala) లో శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఏప్రిల్ (April) నెలలో 20.17 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (EO Dharma reddy) తెలిపారు. శుక్రవారం తిరుపతిలోని అన్నమయ్య భవన్ నుంచి నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వివరాలను వెల్లడించారు.
ఈ నెలలో భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 101.63 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. 94.22 లక్షల లడ్డూలను విక్రయించామని , 39.73 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం అందించామని పేర్కొన్నారు. 8.08 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని ఆయన తెలిపారు.