Pushpayagam | మే 12న కోదండ రామస్వామివారి ఆలయంలో పుష్పయాగం
Pushpayagam | తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో మే 12న పుష్పయాగం నిర్వహించనున్నారు.
తిరుపతి : తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో మే 12న పుష్పయాగం (Pushpayagam ) నిర్వహించనున్నారు.ఉదయం 10 నుంచి11 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత కోదండరామ (Kodanda Ramaswamy) స్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తామని ఆలయ అధికారులు వివరించారు. రాత్రి 7 గంటలకు సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు.
గృహస్తులు రూ.1,000 చెల్లించి టికెట్ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చని సూచించారు. ఏప్రిల్ 5 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన బ్రహ్మోత్సవా (Brahamotsavam) ల్లో జరిగిన తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలిపారు.
తిరుమలలో 76,748 మంది భక్తులు దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . నిన్న స్వామివారిని 76,748 మంది భక్తులు దర్శించుకోగా 30,688 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.10 కోట్లు వచ్చిందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

