హైదరాబాద్, మే 7: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ అంచనాలకుమించి రాణించింది. అమెరికాలో కంపెనీ ఔషధాలకు పెరిగిన డిమాండ్‌తో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,307 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.959 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 36 శాతం అధికం. 2022-23 ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ.6,297 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను 12 శాతం వృద్ధితో రూ.7,083 కోట్లకు ఎగబాకింది.