Bhupalapally | అభిమానానికి అవమానం.. కేసీఆర్ ఫొటో ఉందని టీ షర్ట్ విప్పించారు..
Bhupalapally | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అభిమానంతో ఆయన ఫొటో ఉన్న టీషర్టును ఓ వృద్ధుడు ధరించాడు. ఆ వృద్ధుడి అభిమానాన్ని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోయారు. ఎర్రటి ఎండలో ఉపాధి హామీ పని చేస్తున్న ఆ వృద్ధుడి దగ్గరకు కాంగ్రెస్ నాయకులు వెళ్లి.. కేసీఆర్ ఫొటో ఉన్న టీ షర్టును విప్పించారు.
అందరిముందే అర్ధనగ్నంగా నిలబెట్టారు
ఉపాధి కూలీని అవమానించిన కాంగ్రెస్ నేతలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారo మండలంలో ఘటన
సోషల్ మీడియా లో వీడియో వైరల్
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అభిమానంతో ఆయన ఫొటో ఉన్న టీషర్టును ఓ వృద్ధుడు ధరించాడు. ఆ వృద్ధుడి అభిమానాన్ని కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోయారు. ఎర్రటి ఎండలో ఉపాధి హామీ పని చేస్తున్న ఆ వృద్ధుడి దగ్గరకు కాంగ్రెస్ నాయకులు వెళ్లి.. కేసీఆర్ ఫొటో ఉన్న టీ షర్టును విప్పించారు. తోటి కూలీల ముందు అర్ధనగ్నంగా నిలబెట్టారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఓడిపిలవంచ గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది.
ఒడిపిలవంచ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం కోసం వెళ్లారు. అక్కడే పని చేస్తున్న పొన్న లస్మయ్య టీ షర్ట్ పై కేసీఆర్ ఫొటో, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఫొటోలు ఉన్నాయి. అది చూసిన కాంగ్రెస్ నాయకులు వెంటనే అతని ఒంటిపై నుండి టీ షర్టును విప్పించి దూరంగా పడేశారు. ప్రచారం కొనసాగుతున్నంతసేపు లస్మయ్య అర్ధ నగ్నంగానే నిలబడి ఉన్నాడు. వారు వెళ్లిపోయాక లస్మయ్య మళ్లీ అదే టీషర్ట్ వేసుకొని పనుల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే ఉన్న ఒక కూలీ ఈతంగాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి వైరల్ చేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

