మల్కాజిగిరికి ఎంపీగా ఏం చేశావ్.?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజకీయ పునర్జన్మనిచ్చిన మల్కాజిగిరికి ఏమి చేశాడో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తెలియజేయాలని.. ఎంపీగా గెలిచిన అనంతరం ఏనాడు మల్కాజిగిరి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
- నియోజకవర్గాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చొద్దు
- కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు.. నియోజకవర్గంతో సంబంధం ఉన్నదా..?
- స్థానికుడైనా బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడిని గెలిపిస్తేనే.. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటడు
- వేలాది కోట్లతో ఎల్బీనగర్ కష్టాలు తీర్చిన బీఆర్ఎస్కే ఓటు వేయాలి
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
- ఒక్క అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపితే.. మల్కాజిగిరి రూపురేఖలు మారుస్తా
- బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
మన్సూరాబాద్, మే 7 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజకీయ పునర్జన్మనిచ్చిన మల్కాజిగిరికి ఏమి చేశాడో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు తెలియజేయాలని.. ఎంపీగా గెలిచిన అనంతరం ఏనాడు మల్కాజిగిరి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మన్సూరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, అపార్ట్మెంట్ల వాసులతో కలిసి నిర్వహించిన సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు.. ఎక్కడో నివసించే వారిని గెలిపిస్తే ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకుంటారంటూ ప్రశ్నించారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధి ఉప్పల్‌కు చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపిస్తే ప్రజలకు 24గంటలు అందుబాటులో ఉంటాడని తెలిపారు. ఎవరు గెలిస్తే అందుబాటులో ఉంటారో ప్రజలు ఒక్కసారి గమనించి ఓటు వేయాలని సూచించారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వేలాది కోట్లతో అండర్‌పాస్ రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి విజ్ఞుడైన రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని తెలిపారు.
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్: రాగిడి లక్ష్మారెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేశామంటూ సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు అబద్దాలు అడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాసటగా నిలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్ధి ప్రపంచ పటంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే మల్కాజిగిరి పార్లమెంటు రూపురేఖలు మారుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు దుర్గెంపూడి సాంబిరెడ్డి, జక్కిడి రఘువీర్‌రెడ్డి, కరణం శ్రీకాంత్, రుద్ర యాదగిరి, అత్తాపురం రాంచంద్రారెడ్డి, పారంద నర్సింగ్‌రావు, సిద్దగోని నర్సింహాగౌడ్, ఏలుకొండ రాంకోటి, సిద్దగోని జగదీశ్ గౌడ్, చెంగల్ చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

