Parenting | గుడ్ డాడీ అనిపించుకోవాలంటే..
పిల్లల పెంపకం కత్తిమీద సామే! తల్లిదండ్రుల మాటతీరు, వ్యవహారశైలి పిల్లలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అమ్మానాన్నలు ఇద్దరూ ఉద్యోగులే అయితే.. ఆ కుటుంబ వాతావరణం కాస్త విచిత్రంగానే ఉంటుంది.
Parenting | పిల్లల పెంపకం కత్తిమీద సామే! తల్లిదండ్రుల మాటతీరు, వ్యవహారశైలి పిల్లలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అమ్మానాన్నలు ఇద్దరూ ఉద్యోగులే అయితే.. ఆ కుటుంబ వాతావరణం కాస్త విచిత్రంగానే ఉంటుంది. అయితే, ఎంత బిజీగా ఉన్నా.. ఇంటికి వచ్చాక తల్లులు పిల్లలతో అధిక సమయం గడుపుతుంటారు. అదే తండ్రుల విషయానికి వచ్చేసరికి పిల్లల కోసం సమయాన్ని చాలా తక్కువ మంది కేటాయిస్తుంటారు. గుడ్ డాడీ అనిపించుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
- ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు రోజూ సమయం కేటాయించాల్సిందే! వారానికి ఒకసారైనా బిడ్డలను దగ్గర్లోని పార్కుకు తీసుకెళ్లాలి. తీసుకెళ్లాక వారి మానాన వారిని వదిలేయకుండా.. మీరూ వారితో గేమ్స్ ఆడాలి. అప్పుడే పిల్లలతో బాగా కనెక్ట్ అవగలుగుతారు.
- తండ్రి లక్షణాలు పిల్లలకు ఇట్టే వచ్చేస్తుంటాయి. కాబట్టి, తండ్రి తన పాత్ర సమర్థంగా పోషించాలి. వ్యసనాలు, అబద్ధాలాడటం లాంటి లక్షణాలుంటే.. వాటిని మార్చుకోవాలి. చీటికీమాటికీ ఆవేశపడితే అది పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గ్రహించండి.
- ఈతరం పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. వారిని భరించాలంటే ఓపిక చాలా అవసరం. వాళ్లు వేసే ప్రశ్నలకు నిదానంగా సమాధానం చెప్పాలి. వారితో విలువైన సమయం గడపాలి. అంతేకానీ, తీరిక లేదని కసురుకుంటే.. మంచి తండ్రి అనిపించుకోలేరు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

