OnePlus Nord CE 4 Lite | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్.. తన వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ ఫోన్‌ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నుంచి వన్‌ప్లస్ ధృవీకరణ సర్టిఫికెట్ అందుకున్నట్లు తెలుస్తున్నది. గతేడాది భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ ఫోన్ కొనసాగింపుగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ తీసుకొస్తున్నారు. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న ఈ ఫోన్లో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ రూ.20 వేల లోపు ధరకే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఒప్పో ఏ3 ఫోన్‌ను రీబ్రాండ్ చేసి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తున్నది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6జెన్ 1 ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. బయో మెట్రిక్ అథంటికేషన్తోపాటు సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
గతేడాది ఏప్రిల్‌లో ఆవిష్కరించిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్ కొనసాగింపుగా అప్‌గ్రేడ్స్‌తో వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ ఫోన్ వస్తోంది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అవుతుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ ఇతర ఫీచర్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు.