న్యూఢిల్లీ: కోల్కతా నైట్రైడర్స్ ప్లేయర్లకు చేదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్జెయింట్స్పై భారీ విజయంతో సోమవారం సాయంత్రం కోల్కతాకు బయల్దేరిన జట్టు చార్టెడ్ విమానం వాతావరణ ఇబ్బందులతో పలుమార్లు డైవర్షన్ అయ్యింది.
కోల్కతాలో విమానం ల్యాండ్ చేసేందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో తొలుత గువాహటికి, తిరిగి వారణాసికి డైవర్షన్ చేశారు. దీంతో ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున వారణాసికి చేరుకున్న కేకేఆర్ టీమ్ మంగళవారం స్వస్థలానికి బయల్దేరివెళ్లింది. ఈ విషయాన్ని కోల్కతా మీడియా బృందం వెల్లడించింది.