Health Tips | చీటికీ మాటికీ వచ్చే కోపం ఎంత చేటు చేస్తుందంటే..
‘తన కోపమే తన శత్రువు..’ అన్నారు పెద్దలు. ఆవేశానికి పోయి అవకాశాలు కోల్పోతే వచ్చిన ప్రమాదమేం లేదు. కానీ, కోపం కారణంగా ఆరోగ్య నష్టం జరుగుతుందనీ, తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Health Tips | ‘తన కోపమే తన శత్రువు..’ అన్నారు పెద్దలు. ఆవేశానికి పోయి అవకాశాలు కోల్పోతే వచ్చిన ప్రమాదమేం లేదు. కానీ, కోపం కారణంగా ఆరోగ్య నష్టం జరుగుతుందనీ, తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు ఆగ్రహోద్రిక్తులు అవుతున్నారంటే మీ ఆరోగ్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నారని గమనించాలి. ఇంతకీ చీటికీ మాటికీ వచ్చే కోపం ఎంత చేటు చేస్తుందంటే…
కోపం కారణంగా కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి. కోపంగా ఉన్న సమయంలో మన మెదడులోని రక్తనాళాలు సంకోచిస్తాయి. ఇలాంటి పరిస్థితులలో కోపం ఒక్కొక్కసారి రక్తనాళాలు దెబ్బతినేలా చేస్తుంది. విపరీతమైన కోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాని కారణంగా అనేక ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంది.
అధిక కోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మితిమీరిన కోపం తెచ్చుకోవడం ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతుంది. కోపం వల్ల తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది.
ఒక్కొక్కసారి విపరీతమైన కోపం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. చాలా కోపంగా ఉండే వ్యక్తుల్లో కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ. అంతేకాదు చర్మ సంబంధిత సమస్యలు సోరియాసిస్, ఎగ్జిమా వచ్చే అవకాశం ఉంది. అందుకే కోపాన్ని జయించి తన శాంతమే తకు రక్ష సూత్రాన్ని వంటబట్టించుకోవడం అవసరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

