దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
రోజూ వెలిగించే దేవుడి దీపమే ప్రమాదానికి కారణమై, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కళ్లముందే బూడిదై పోవడంతో ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సంఘటన కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన...
– నగదు, ఇంటి సామగ్రితో పాటు ఫొటో స్టూడియో పరికరాలు బూడిద
– కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో ఘటన
కట్టంగూర్, నవంబర్ 28 : రోజూ వెలిగించే దేవుడి దీపమే ప్రమాదానికి కారణమై, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కళ్లముందే బూడిదై పోవడంతో ఓ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సంఘటన కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుడిసె రమేశ్ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం అతడి భార్య కళ్యాణి దేవుడి గదిలో దీపం వెలిగించింది. రమేశ్ ఫొటో స్టూడియోకు వెళ్లగా, కళ్యాణి నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీపం పక్కన ఉన్న వస్తువులకు మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు ఇల్లు అంతా వ్యాపించి విద్యుత్ తీగలకు అంటుకోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాద తీవ్రత పెరిగింది.

Kattangur01
ఇంట్లో నుండి పొగలు, మంటలు రావడం గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. రూ.30 వేల నగదుతో పాటు బియ్యం, దుస్తులు, ఇంటి సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. రమేశ్ జీవనాధారమైన ఫొటో స్టూడియోకు సంబంధించిన కెమెరా, నాలుగు ఎల్ఈడీ స్క్రీన్లు, పాస్ ఫొటో మిషన్, ఇతర పరికరాలు సైతం మంటల్లో కాలి బూడిదయ్యాయి. కష్టపడి కూడబెట్టుకున్న నగదు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడే వస్తువులు, ఉపాధికి ఆధారమైన ఫొటో స్టూడియో సామగ్రి ఒక్కసారిగా కాలిపోవడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షలు నష్టం వాటిల్లినట్లు రమేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
‘ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

