Lenovo Tab K11 | ప్రముఖ చైనా టెక్ దిగ్గజం లెనోవో (Lenovo) తన లెనోవో టాబ్ కే11 (Lenovo Tab K11) టాబ్లెట్‌ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్ తో పని చేసే ఈ న్యూ ఆండ్రాయిడ్ టాబ్లెట్.. 10.95 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ టాబ్లెట్. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటది. లెనోవో టాబ్ 11 టాబ్లెట్ డోల్బీ ఆట్మోస్ టెక్నాలజీతో క్వాడ్ స్పీకర్లతో వస్తున్నది. సింగిల్ చార్జింగ్ చేస్తే 10 గంటల పాటు వీడియో ప్లే బ్యాక్ టైం బ్యాకప్ కలిగి ఉండే 7040 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
లెనోవో టాబ్ కే11 (Lenovo Tab K11) టాబ్లెట్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,990, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,990లకు లభిస్తుంది. లునా గ్రే, సీఫోమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లెనోవో డాట్ కామ్ పై సేల్స్ ప్రారంభం అయ్యాయి.
న్యూ లెనోవో టాబ్ కే11 (Lenovo Tab K11) టాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 అప్ గ్రేడ్స్ అందిస్తుంది. 2028 జనవరిలో కొత్త టాబ్లెట్ ఆవిష్కరించే వరకూ సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. లెనోవో టాబ్ కే11 టాబ్లెట్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 10.95 అంగుళాల (1200×1920 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటది. ఒక్టాకోర్ మీడియాటెక్ హేలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటది. ఈ టాబ్లెట్ డిస్ ప్లేకు టీయూవీ రైన్ లాండ్ బ్లూ లైట్ సర్టిఫికెట్ ఉంటది.
లెనోవో టాబ్ కే11 (Lenovo Tab K11) టాబ్లెట్ 13-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. వై-ఫై 802.11, బ్లూటూత్ 5.1, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ స్పెషల్ ఆడియో టెక్నాలజీతో రూపుదిద్దుకున్న నాలుగు స్పీకర్లు జత చేశారు.
లెనోవో టాబ్ కే11 టాబ్లెట్ 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 7040 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే 10 గంటల వీడియో ప్లే బ్యాక్ టైం కలిగి ఉంటుంది. మరో లెనోవో పర్సనల్ కంప్యూటర్, లెనోవో లాప్టాప్కు నిత్యం అనుసంధానించేందుకు లెనోవో ఫ్రీ స్టైల్, లెనోవో టాబ్ పెన్ ప్లస్‌తోపాటు పలు సాఫ్ట్ వేర్ ఫీచర్లు జత చేశారు.